01-04-2025 10:26:16 AM
కోల్‌కతా,(విజయక్రాంతి): పశ్చిమ బెంగాల్‌లో విషాదం చోటు చేసుకుంది. బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలోని పథార్ ప్రతిమలో సోమవారం రాత్రి గ్యాస్ సిలిండర్ పేలి ఏడుగురు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం... పత్తర్ ప్రతిమా బ్లాక్‌లోని ధోలాఘాట్ గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలిన ఇంటిని కొందరు బాణసంచా తయారీ కేందంగా ఉపయోగించకుంటున్నారు. ఈ నేపథ్యంలో గత రాత్రి 9 గంటల ప్రాంతంలో జరిగిన సిలిండర్ పేలుడు సంభవించింది. సమచారం అదుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు.
ఈ ప్రమాద సమయంలో ఇంట్లో మొత్తం 11 మంది ఉన్నారని, వారిలో ఏడుగురు మృతి చెందగా, మిలిన నలుగురి అచూకీ గల్లంతైంది. మృతుల్లో నలుగురు పిల్లలు, ఇద్దరు మహిళలు సహా ఏడుగురు మరణించారని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. అన్ని మృతదేహాలను వెలికితీసి శవ పరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. గాయపడిన మరి కొందరిని ఆసుపత్రిలో చేర్చినట్లు సుందర్‌బన్ పోలీస్ జిల్లా ఎస్పీ కోటేశ్వరరావు వెల్లడించారు. ప్రమాద సమయంలో ఇంట్లో రెండు గ్యాస్ సిలిండర్లు ఉన్నాయని, లోపల నిల్వ ఉంచిన బాణసంచా మంటల్లో చిక్కుకున్న తర్వాత మంటలు వ్యాపించిన పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తెలింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.