రంజీ ట్రోఫీ 2024-25
న్యూఢిల్లీ: రంజీ ట్రోఫీలో భాగంగా తొలిరోజే ఏడు సెంచరీలు నమోదవ్వడం విశేషం. తొలి రోజు మొత్తం 16 ఎలైట్ మ్యాచ్‌లు, 3 ప్లేట్ మ్యాచ్‌లు మొదలయ్యాయి. సుదీప్ (బెంగాల్), శుభమ్ ఖజురియా (130*, జమ్మూ కశ్మీర్), రవి చౌహాన్ ( సర్వీసెస్), మనన్ హింగ్రజియా (174*, గుజరాత్), శుభమ్ అరోరా (హిమాచల్ ప్రదేశ్), ప్రశాంత్ (హిమాచల్ ప్రదేశ్), సుయాశ్ (గోవా) సెంచరీలు సాధించారు.
కాగా దేశవాలీ క్రికెట్ టోర్నీల్లో బీసీసీఐ కీలక నిబంధనలు తీసుకొచ్చింది. ఇకపై మిడ్ ఇన్నింగ్స్‌ల్లో ఆటగాళ్లు గాయాలు, అనారోగ్యం, అత్యవసర సమయం మినహాయించి మిగతా కారణాలతో రిటైర్డ్‌గా వెనుదిరిగితే ఆ మ్యాచ్‌లో మరోసారి బరిలోకి దిగేందుకు అవకాశం లేదు. ఈ నిబంధన బీసీసీఐ డొమెస్టిక్ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లకు వర్తిస్తుందని బీసీసీఐ పేర్కొంది. బాల్ టాంపరింగ్, ఓవర్ త్రో బౌండరీల్లోనూ పలు మార్పులు చేశారు.