calender_icon.png 30 March, 2025 | 4:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టెన్త్ మ్యాథ్స్ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో ఏడుగురు అరెస్ట్

27-03-2025 09:20:14 AM

హైదరాబాద్: కామారెడ్డి జిల్లా(Kamareddy District)లో సంచలనం రేపిన పదో తరగతి గణిత ప్రశ్నాపత్రంలో లీకేజీ కేసులో ఏడుగురు అరెస్ట్ అయ్యారు. జుక్కల్ జిల్లా పరిషత్ పాఠశాల పరీక్ష కేంద్రం నుంచి కొన్ని ప్రశ్నలు లీక్ అయ్యాయి. గణిత ప్రశ్నాపత్రం(10th class Maths question paper)లో పలు ప్రశ్నలను నీళ్లు సరఫరా చేసే వ్యక్తి రాసుకొచ్చాడు. ప్రశ్నలను కాగితంపై రాసుకొచ్చిన వాటర్ మెన్ పత్రాన్ని ఓ విద్యార్థి తండ్రికి ఇచ్చాడు. గణిత ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలు సోషల్ మీడియా(Social media)లో చక్కర్లు కొట్టాయి. విషయం తెలుసుకున్న పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ సునీల్, డి పార్ట్ మెంటల్ అధికారి భీం, పరీక్ష కేంద్రం ఇన్విజిలేటర్ దీపికనూ ఉన్నతాధికారులు ఇప్పటికే సస్పెండ్ చేశారు. గణిత పేపర్ ప్రశ్నల లీక్ పై విచారణ కొనసాగుతోంది.