24-02-2025 01:02:04 AM
భూపాలపల్లి, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఈ నెల 19న జరిగిన నాగవెల్లి రాజలింగమూర్తి హత్య కేసులో పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు. ఆదివారం ఎస్పీ కిరణ్ ఖరే వివరాలు వెల్లడించారు. భూపాలపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఎకరం భూ తగదా విషయంలో ఈ హత్య జరిగినట్లు తెలిపారు. నిందితులు రాజలింగ మూర్తి కంట్లో కారం చల్లి రాడ్లతో దాడి చేసి కత్తులతో పొడిచి చంపారని తెలిపారు.
ఈ కేసులో 10 మందిపై కేసు నమోదు కాగా ఏ డుగురిని అరెస్టు చేశామన్నారు. వారిలో భూపాలపల్లికి చెందిన రేణుకుంట్ల సంజీవ్, పింగిలి సేమంత్, మోరే కుమార్, కొత్తూరి కిరణ్, రేణికుంట్ల కొమురయ్య, దాసారపు కృష్ణ, రేణికుంట్ల సాంబయ్య ఉన్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల్లో భూ పాలపల్లి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, పుల్ల సురేశ్, పుల్ల నరేశ్ ఉన్నారు.
సమావేశంలో భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు, భూపాలపల్లి సీఐ నరేశ్‌కుమార్, చి ట్యాల సీఐ మల్లేశ్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ వెంక టేశ్వర్లు, భూపాలపల్లి గణపురం, ఎస్సైలు సాంబమూర్తి, రమేశ్, అశోక్, సందీప్, సుధా కర్, రాజు, పాల్గొన్నారు.