calender_icon.png 23 February, 2025 | 8:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంత్ సేవాలాల్ అడుగుజాడల్లో నడవాలి

19-02-2025 01:39:00 AM

 ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

జగిత్యాల అర్బన్, ఫిబ్రవరి 18 (విజయ క్రాంతి): సంఘసంస్కర్త, గొప్ప మానవతా వాది సంత్ సేవాలాల్ అడుగుజాడలో ప్రతి ఒక్కరు నడవాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజ య్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కేం ద్రంలో బంజారా భవన్ వద్ద  సంత్ సేవా లాల్ మహారాజ్ 286 జయంతి (భోగ్ భండార్) ఉత్సవాల్లో జగిత్యాల శాసనస భ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొ న్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ దురాచారాలను,  ఆశాస్త్రీయమైన అపో హలను నమ్ముతూ జీవిస్తున్న బంజారా జాతులను తన ఆలోచనలు, ప్రసంగాలతో చైతన్యపరిచిన మహనీయుడు సేవాలాల్ మహారాజ్ అని అన్నారు. సేవాలాల్ మహా రాజ్ గొప్ప సంఘ సంస్కర్త, బంజారాల ఆరాధ్య దైవం, ప్రకృతి ప్రేమికుడు, ఆధ్యాత్మి క గురువు బంజారాల సంస్కృతి సాంప్రదా యాల పరిరక్షణకు కృషి చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.

తెలంగాణ రాష్ర్టం లో బంజారాల అభివృద్ధి కి,ఆత్మ గౌరవానికి ముఖ్యమంత్రి  సహకారం తో కృషి చేస్తాన న్నారు.  జగిత్యాల జిల్లా కేంద్రంలో బంజా రాలకు పోస్ట్ మెట్రిక్ హాస్టల్ ఏర్పాటుకు రు.1 కోటి 10 లక్షల నిధులు కేటాయించగా,  స్థల సమస్య ఉందని,వచ్చే మార్చి లో మరొక స్థలం కేటాయించడం కోసం జిల్లా కలెక్టర్ కు,అధికారులకు విన్నవించడం జరి గిందన్నారు. జిల్లా బంజారా భవన్ నిర్మా ణం కోసం రు.50 లక్షల నిధులు మంజూ రుకు ముఖ్యమంత్రి ని, ప్రిన్సిపాల్ సెక్రటరీ నీ కోరడం జరిగిందని, ప్రతి ఏడాది సేవాలా ల్ జయంతికి 10 లక్షల నిధులు కేటాయిం చాలని కోరడం జరిగిందని అన్నారు.

జగిత్యాల నియోజకవర్గంలో ఏకలవ్య పాఠ శాల మంజూరు కోసం ఎంపీ,  కేంద్ర మం త్రినీ సైతం కలవడం జరిగిందని గుర్తుచే శారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్ లత మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,మాజీ లైబ్రరీ డైరెక్టర్ చేట్పల్లి సుధాకర్, దశరత్ నాయక్, భూక్యా నరేంద ర్, అజ్మీరా సంతోష్ నాయక్, అరుణ్, ప్రభా కర్, నందు నాయక్, ధర్మాజీపేట్ చిరంజీవి, రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.