11-02-2025 12:00:00 AM
మోతె, ఫిబ్రవరి 10 : సేవాలాల్ మహా రాజ్ జయంతి వేడుకలు విజయవంతం చేయాలని సేవాలాల్ ఉత్సవ కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహా రాజ్ 286వ జయంతిని పురస్కరించుకుని ఈనెల 15న కోదాడలో జరిగే సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను విజయవంతం చేయడానికి మోతెలో ఉన్న లంబాడి సోదరులందరూ కదలి రావాలని కోరారు. మోతె మండల ఇంచార్జీ ఎంపీడీవో ఆంజనేయులుని ఆహ్వానించారు. సేవాలాల్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు బాణోతు బాబు నాయక్, ఉపాధ్యక్షులు భూక్యా రవి నాయక్, ధారావత్ కృష్ణ నాయక్ తదితరులు పాల్గొన్నారు.