calender_icon.png 20 September, 2024 | 12:04 PM

యువత ప్రధాని నరేంద్ర మోదీ అడుగుజాడల్లో నడవాలి

19-09-2024 05:45:11 PM

యాదాద్రి భువనగిరి,( విజయక్రాంతి): భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా సేవా మహా యజ్ఞంలో భాగంగా ఎస్ఎస్ఆర్  జూనియర్ కళాశాల భువనగిరిలో బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పట్నం కపిల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ రక్తదాన శిబిరాన్ని బిజెపి జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ప్రధానమంత్రి నరేంద్రమోదీ 74వ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా మహాయజ్ఞం కార్యక్రమంలో భాగంగా ఈ రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది.

భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచంలోనే అత్యధిక ఆదరణ కలిగిన నాయకుడని, భారతదేశంను విశ్వ గురువుగా నిలపడానికి నిర్విరామంగా కృషి చేస్తున్న మహా మనిషిని నరేంద్ర మోడీ జీ, విద్యార్థులు యువకులు దేశభక్తులై జాతీయవనాన్ని పెంచుకొని దేశ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి మన ప్రియతమ ప్రధాని గౌరవ శ్రీ నరేంద్ర మోడీ అడుగుజాడలో నడవాలన్నారు. దేశం కోసం ధర్మం కోసం దేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో సేవా మహా యజ్ఞం జిల్లా కన్వీనర్  తుమ్మల మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ... ప్రధానమంత్రి నరేంద్రమోదీ 74వ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్త ప్రచారంలో భాగంగా  తెలంగాణా బీజేపీ రాష్ట్రంలో 'సేవా పఖ్వాడా'ని సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు 'సేవా పఖ్వాడా' (సేవా పక్షం రోజులు) కొనసాగుతుంది. 

జయంతిని ఈ రక్తదాన శిబిరంలో 74 మంది యువత రక్తం ఇచ్చారు. ఈ రక్తదానానికి సహకరించినటువంటి కళాశాల యజమాన్యానికి, విద్యార్థులకు, యువతకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సేవా మహా యజ్ఞ జిల్లా కోకన్వీనర్లు బట్టు క్రాంతి, కుక్కొండ లక్ష్మీనారాయణ గౌడ్, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి చందా మహేందర్ గుప్తా, ఊట్కూరి అశోక్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ మాయ దశరథ, సురేష్ రెడ్డి, ఆత్మకూరు ప్రశాంత్, బొమ్మ మధు, తదితరులు పాల్గొన్నారు.