రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
ఉత్సాహంగా రన్ ఫర్ గర్ల్ చైల్డ్
శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 2 (విజయక్రాం తి): సేవాభారతి తెలంగాణ ఆధ్వర్యంలో ‘బాలికల సాధికారత కిషోరి వికాస్ కార్యక్రమం’ గురించి అవగాహన కల్పించడానికి నిర్వహించిన రన్ ఫర్ గర్ల్ చైల్డ్ 21కే, 10కే, 5కే రన్ 9వ ఎడిషన్ గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం ఉత్సాహంగా సాగింది. ఈ రన్ లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, విద్యార్థులు 11వేల మందికి పైగా పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఐటీశాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు విజేతలకు మెమొంటోలు అందజేశారు.
ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఫ్రీడమ్ ఆయిల్ జీఎం చేతన్, గ్లోబల్ డేటా డైరెక్టర్ రాజీవ్‌గుప్తా, పాల్టెక్ శ్యాంపాల్‌రెడ్డి మంత్రితో కలిసి విజేతలను అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ.. వెనుకబడిన ప్రాంతాల్లో ఆడపిల్లల సాధికారతకు సేవా భారతి తెలంగాణ చేస్తు న్న కృషిని ప్రశంసించారు.
ఇప్పటికే సేవా భారతి 10,500 మంది బాలికల జీవితాలను ప్రభావితం చేసిందని, 2030 నాటికి 1,00,000మంది లక్ష్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సంస్థ జాతీయ ప్రధాన కార్యదర్శి పరాగ్ అభయాంకర్, సేవా భారతి తెలంగాణ అధ్యక్షుడు దుర్గారెడ్డి మాట్లాడుతూ..
రన్ ఫర్ గర్ల్ చైల్డ్ కార్యక్రమం బాలికల అభ్యున్నతికి ఎంతో తోడ్ప డుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ఎన్నో సంస్థలు, పోలీసులు మద్దతుగా నిలిచాయని కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఇన్ఫోసిస్ సీఎస్‌ఆర్‌హెడ్ వంశీపరంజ్యోతి, ఫిల్టరేషన్ గ్రూప్ సీఎఫ్‌వో వినోద్, యూఎస్టీ గ్లోబల్ సీఎస్‌ఆర్ హెడ్ తిరుమల్ విజయ్ తదితరులు పాల్గొన్నారు.