18-04-2025 12:00:00 AM
సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
వారాసిగూడ ఏప్రిల్ 17 (విజయక్రాంతి): సీతాఫలమండీలోని సెట్విన్ శిక్షణా కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే ఓ మోడల్ కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని, మరో రెండు అంతస్తుల్లో భవన సముదాయాన్ని నిర్మించి కొత్త ట్రేడ్‌లలో శిక్షణను కల్పిస్తామని సికింద్రాబాద్ శాసనసభ్యుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ తెలిపారు. గురువారం ఆయన సెట్విన్ శిక్షణ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
విద్యార్ధులు, సిబ్బందితో ముచ్చటించారు. బ్యుటీ షియన్, కంప్యూటర్, ఫాషన్ డిజైనింగ్, హోటల్ మేనేజ్ మెంట్, మొబైల్ రేపైరింగ్, సీసీ కెమెరా రేపైరింగ్ విభాగాల కార్యకలాపాలను పరిశీలిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐదేళ్ళ క్రితం సితాఫలమండీలో నెలకొల్పిన సెట్విన్ శిక్షణా కేంద్రం తన ప్రత్యేకతను చాటుకుంటుందని తెలిపారు. త్వరలో దీని కార్యకలా పాలు విస్తరిస్తామని తెలిపారు. విద్యార్ధుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రం ఇంచార్జ్ అనిత తదితరులు పాల్గొన్నారు.