15-03-2025 10:51:58 PM
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని కంచుకోట కాలనీకి చెందిన రాపర్తి నరేష్ తన ఇంటి ముందు వేసవిలో మూగజీవాల దాహాన్ని తీర్చేందుకు ప్రత్యేకంగా నీటి తొట్టిని ఏర్పాటు చేసి అందరి మన్ననలు పొందుతున్నాడు. ప్రతి ఒక్కరు తమ ఇంటి ముందు నీటి తొట్టెలు ఏర్పాటు చేయడం వల్ల మూగజీవాలతో పాటు పక్షులు దాహం తీర్చుకుంటాయని ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరుతున్నాడు. కాలనీలు, ప్రధాన కూడలి వద్ద మూగజీవాలకు నీటి సదుపాయం ఏర్పాటు చేసేందుకు సంబంధిత శాఖల అధికారులు విషయాలని ప్రజలు కోరుతున్నారు.