calender_icon.png 30 September, 2024 | 10:46 AM

హెల్ప్‌డెస్క్‌ల ఏర్పాటు

30-09-2024 02:23:29 AM

  1. మూసీ నిర్వాసితులకు న్యాయం చేస్తాం 
  2. ఇళ్లు, ఉపాధితో పాటు ప్రభుత్వ పథకాల్లో ప్రాధాన్యం 
  3. ప్రజలను రెచ్చగొడుతున్న అవకాశవాద శక్తులు 
  4. హైడ్రాకు అందరూ ఒక్కటే : మంత్రి శ్రీధర్‌బాబు 

హైదరాబాద్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): మూసీ నిర్వాసితులకు న్యాయం చేసిన తర్వాతే ప్రక్షాళన చేపడతామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. హైడ్రా, మూసీ విషయంలో అనుమానాల నివృత్తికి, సమస్యలను విన్నవించు కోవడానికి అన్ని కలెక్టరేట్లలో హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటుచేస్తున్నట్లు పేర్కొ న్నారు.

మూసీ నిర్వాసితులకు ఇళ్లతో పాటు ఉపాధి కల్పించే బాధ్యత ప్రభుత్వానిదని, పథకాల్లోనూ నిర్వాసితులకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఆదివారం మంత్రి శ్రీధర్‌బాబు సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..

హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకె ళ్తుంటే కొన్ని అవకాశవాద శక్తులు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. పేదలను నిలబెట్టాలన్నదే మా ఉద్దేశమని, నిర్వాసితులందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటామన్నారు.

మూసీ ప్రక్షాళన గురించి చెప్పారుగా.. 

బిల్డర్ల చేతిలో మోసపోయిన పేదలు, మధ్యతరగతి వారి నివాసాల విషయంలో ప్రభుత్వం తొందరపడదని, ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తామన్నారు. అడ్డగోలుగా అనుమతులిచ్చిన అధికారులపై చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు. అపార్ట్‌మెంట్ నిర్వాసితులకు ఏ రకంగా న్యా యం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచిస్తున్నారని శ్రీధర్‌బాబు తెలిపారు.

బిల్డర్ల చేతి లో మోసపోయిన వారి విషయంలో మానవీయ దృక్ఫథంతో వ్యవహరిస్తామన్నారు. మూసీ ప్రక్షాళన చేస్తామని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా చెప్పి చేయలేదని, ఇప్పు డు తమ ప్రభుత్వం చేస్తుంటే అడ్డంకులు సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. హైడ్రా విషయంలో ఎవరైనా ఒక్కటేనని సీఎం రేవం త్‌రెడ్డి సోదరుడికి కూడా నోటీసులు ఇచ్చిందని మంత్రి తెలిపారు. 

మూసీ నదిలో గోదావరి నీళ్లు.. 

హైదరాబాద్‌కు గోదావరి జలాలను తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని, గోదావరి నీటిని మూసీనదిలో ప్రవ హింపచేస్తామని మంత్రి పేర్కొన్నారు. ‘మూ సీ ప్రక్షాళనకు ఈస్ట్, వెస్ట్ కారిడార్ల నిర్మాణం, లింక్ రోడ్ల ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. మూసీపైన ఫ్లుఓవర్లు నిర్మిస్తాం. పీపీపీ విధానంలో నిర్మాణాలుంటాయి. ప్రపంచంలోనే బెస్ట్ సిటీగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతాం.

34 టీమ్‌లతో సోషియే ఎకనమిక్ సర్వే చేస్తు న్నాం. వాక్ టూ వర్క్ పద్ధతిలో ఉపాధి కల్పి స్తాం. పేద, మధ్యతరగతి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయం చూపిస్తాం. 12 ఎన్జీవో ప్రతినిధులతో సంప్రదింపులు చేస్తు న్నాం. సొంత ఇండ్లు లేనివారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నాం. వివిధ ప్రభుత్వ శాఖలు బాధితులకు ఉపాధి కల్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.

అంగన్‌వాడీ కేంద్రాల ను ఏర్పాటు చేసి.. పిల్లలను ఆరేళ్లపాటు చదివిస్తాం. స్వయం సహాయక మహిళా గ్రూప్‌ల తో వడ్డీలేని రుణాలు ఇప్పిస్తాం. పునరావా సం కోసం ఇప్పటికే  హైలెవల్ కమిటీ పని చేస్తోంది. రివర్‌బెడ్ గుర్తించే నివాసాలకు కూడా భూ సేకరణ చట్టెేం2013 ప్రకారం పరిహారం చెల్లిస్తాం. మూసీ మాస్టర్ ప్లాన్ బ్లూ ప్రింట్ తయారు చేశాం, పారదర్శకంగా పనులుంటాయి. అంతర్జాతీయ స్థాయి గుర్తింపున్న సంస్థలనే ఆహ్వానిస్తున్నాం’ అని మంత్రి పేర్కొన్నారు. 

రైతు మల్లారెడ్డి మృతిని తెలంగాణ ప్రజలు మరువలేదు

హైడ్రా అంశంపై బీఆర్‌ఎస్ లీడర్లు ముసలి కన్నీరు కారుస్తూ.. చిన్న అంశా న్ని బూతద్దతంలో పెట్టి చూపించే ప్రయ త్నం చేస్తోందని మంత్రి శ్రీధర్‌బాబు మండిపడ్డారు. మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల విషయంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏమి చేసిందో అందరికీ తెలుసన్నారు.

మల్లారెడ్డి అనే రైతు చితిపెట్టుకొని మృతిచెందిన ఘటనను తెలంగాణ ప్రజలు మరువలేదన్నారు. మల్లన్నసాగర్ నిర్వాసితుల తరఫున దామోదర రాజనర్సిం హ పోరాటం చేశారన్నారు. రేవంత్‌రెడ్డి, భట్టి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలను బాధితులను కలువనీయలేదన్నారు. కానీ ప్రజా పాలనలో ప్రతిపక్ష నాయకులు ఎక్కడికి వెళ్లినా అనుమతులు ఇస్తున్నామన్నారు.