calender_icon.png 16 April, 2025 | 8:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో చలివేంద్రాలు ఏర్పాటు

16-04-2025 01:27:11 PM

టి ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రారంభించిన చండూర్ పిఎసిఎస్ చైర్మన్ కోడి సుష్మవెంకన్న

మునుగోడు(చండూర్), (విజయక్రాంతి): టిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాలను ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు సద్వినియోగం చేసుకోవాలని డిసిసిబి డైరెక్టర్, పిఎసిఎస్ చైర్మన్ కోడి సుష్మా వెంకన్న అన్నారు.బుధవారం మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో టిర్ ఫౌండేషన్ సహకారంతో  ఏర్పాటు చేసిన చలివేంద్రాలను కస్తాల గ్రామంలో మండల వ్యవసాయ అధికారి చంద్రిక తో కలిసి ప్రారంభించి మాట్లాడారు.

మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల్లో చల్లని త్రాగు నీరుతో చలి వేంద్రాలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.కొనుగోలు కేంద్రాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసిన ఫౌండేషన్ చైర్మన్ బొబ్బల వెంకట్ రామ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.భవిష్యత్తులో  రైతు కుటుంబాల కోసం మరెన్నో కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ ,డైరెక్టర్ శ్రీ కట్ట బిక్షం  ,కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు శ్రీ సామ అమరేందర్ రెడ్డి  ,లక్ష్మీ , బూతరాజు ఫణి గారు ,ఫౌండేషన్ సభ్యులు పిన్నింటి వెంకట్ రెడ్డి ,పిన్నింటి నరేందర్ రెడ్డి ,రాజు ,రఘు ,సైదులు, రవి , దిలీప్,నర్సింహా, రైతులు పాల్గొన్నారు.