calender_icon.png 16 January, 2025 | 6:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైడ్రా ఏర్పాటు మంచి నిర్ణయం

25-08-2024 01:59:57 AM

నేతల కబ్జాలోని భూములు స్వాధీనం చేసుకోవాలి

పేదలకు డబుల్‌బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలి 

వీ హనుమంతరావు 

హైదరాబాద్, ఆగస్టు 24 (విజయక్రాంతి): కబ్జా లకు గురైన ప్రభు త్వ భూములు, చెరువులను కాపాడేందుకు, బఫర్ జోన్ లో అక్రమ కట్టడాలను కూల్చి స్వాధీ నం చేసుకోవడానికి హైడ్రా ఏర్పాటు మంచి నిర్ణయమని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు అన్నారు.  బడాబాబుల చేతుల్లో ఉన్న ప్రభుత్వ భూములను కూడా స్వాధీనం చేసుకు ని, పేదలకు డబుల్‌బెడ్‌రూం ఇళ్లను కట్టివ్వాలని సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

శనివారం ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. అక్రమ నిర్మాణా ల కూల్చివేతకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. రామంతాపూర్, బతుకమ్మకుంట చెరువులు ఆక్రమణలకు గురయ్యాయని చెప్పారు. జన్వాడ ఫాంహౌస్ గతంలో తనదే అన్న కేటీఆర్.. ఇప్పుడు దోస్తుదని, అతని నుంచి లీజుకు తీసుకున్నానని చెప్తున్నారని అన్నారు. కేటీఆర్‌దైనా.. ఆయన దోస్తుదైనా బఫర్ జోన్‌లో ఉంటే కూల్చివే యాల్సిందేనని స్పష్టంచేశారు.