calender_icon.png 4 April, 2025 | 1:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంపిటేటివ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల కోసం రీడింగ్ రూమ్ ఏర్పాటు

03-04-2025 06:18:30 PM

ఐటిడిఎ పీఓ రాహుల్..

భద్రాచలం (విజయక్రాంతి): ఉత్సాహవంతులైన నిరుద్యోగులైన యువతీ, యువకులకు డీఎస్సీ, ఎస్సై, ఇతర గ్రూపులకు సంబంధించిన పుస్తకాలు, పాఠకులు విషయాలను కూర్చొని చదువుకోవడానికి అధునాతన హంగులతో రీడింగ్ రూము నిర్మాణం చేపడుతున్నట్లు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు. గురువారం భద్రాచలం పట్టణం తాత గుడి సెంటర్లోని గ్రంథాలయమును ఆయన సందర్శించి గ్రంథాలయంలో నూతనంగా నిర్మాణం చేపడుతున్న పాఠకులు చదువుకునే హాలు యొక్క నిర్మాణం పనులను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రంథాలయంలో చదువుకోవడానికి సరైన పుస్తకాలు అందుబాటులో లేవని, దాతల సహాయంతో ఈ గ్రంథాలయం నడుస్తున్నదని, డీఎస్సీ, ఎస్సై, ఇతర గ్రూపులు ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు సరిపడా పుస్తకాలు లేక చాలామంది యువతీ యువకులు ఇబ్బందులు పడుతున్నారని గతంలో యువకులు నా దృష్టికి తీసుకురాగా, గ్రంథాలయానికి విశాలంగా కూర్చొని చదువుకోవడానికి వంద మంది కూర్చొని చదువుకునే విధంగా ఖాళీగా ఉన్న ప్రదేశంలో హాలు నిర్మాణం పనులు జరుగుతున్నాయని, అలాగే మంచినీటి సౌకర్యం, టాయిలెట్లు కూడా నిర్మిస్తామని, చదువుకునే మీటింగ్ హాలులో విద్యుత్ సౌకర్యంతో టేబుల్స్ కుర్చీలు అన్ని సమకూరుస్తున్నామని అన్నారు. ఒక వారం రోజులలో రీడింగ్ రూమ్ నిర్మాణం పూర్తికావాలని ఈఈ ట్రైబల్ వెల్ఫేర్కు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ చంద్రశేఖర్, డి హరీష్, టిఏ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.