26-02-2025 06:17:26 PM
బుగ్గలో ట్రాన్స్ఫార్మర్ చుట్టూ కంచె ఏర్పాటు...
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వద్ద శివరాత్రి సందర్భంగా జరిగే జాతరలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ప్రమాదకరంగా ఉందని, విజయక్రాంతిలో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. మంచిర్యాల డిఎఫ్ వో శివ ఆశిష్ కుమార్ సింగ్ జోక్యం చేసుకొని ట్రాన్స్ఫార్మర్ చుట్టూ కంచె వేయాల్సిందిగా అటవీ అధికారులను ఆదేశించారు. దీంతో బుధవారం జాతర ప్రారంభమయ్యే సరికి ప్రమాదకరంగా విద్యుత్ తీగలు వేలాడుతున్న ట్రాన్స్ఫార్మర్ చుట్టూ కర్రలతో కంచె ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. విజయక్రాంతి కథనానికి స్పందించి అటవీ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేశారు.