calender_icon.png 1 March, 2025 | 4:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రంప్ సర్కార్‌కు ఎదురుదెబ్బ

01-03-2025 01:02:47 AM

ఉద్యోగుల తొలగింపు నిర్ణయం నిలిపివేత

వాషింగ్టన్, ఫిబ్రవరి 28: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. భారీ సం ఖ్యలో ఫెడరల్ ఉద్యోగులను తొలగి స్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి విలియం ఆల్సప్ అడ్డుకున్నారు. ట్రంప్ నిర్ణయాన్ని నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. పర్స నల్ మేనేజ్‌మెంట్ కార్యాలయానికి అలాంటి అధికారాలు లేవని న్యాయమూర్తి స్పష్టం  చేశారు.  తొలగింపు ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని తెలిపారు.

అమెరికాలో ప్రభుత్వ వ్యయాల తగ్గింపు ప్రణాళికల్లో భాగంగా ట్రంప్ సర్కార్ పలు విభాగాల్లో పెద్ద ఎత్తున కోతలు విధిస్తున్న సంగతి తెలిసిందే. అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచే ట్రంప్ దూకుడైన నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ ఆయన చర్యలను కోర్టులు అడ్డుకుం టూ వస్తున్నాయి. పుట్టుకతోనే లభించే పౌరసత్వం రద్దు చేస్తూ ట్రంప్ సం తకం చేసిన ఉత్తర్వులను కోర్టు నిలిపివేసింది. ఆ తర్వాత శరణార్థులకు సం బంధించి తీసుకున్న నిర్ణయానికి వెస్ట్‌కోస్ట్ కోర్టు అడ్డుకట్ట వేసింది.