08-04-2025 01:29:58 AM
భారత్‌కు అప్పగించొద్దన్న వినతిని తోసిపుచ్చిన అమెరికా సుప్రీం కోర్టు
వాషింగ్టన్, ఏప్రిల్ 7: పాకిస్తాన్ మూలాలున్న కెనడా వ్యాపారవేత్త, 2008 ముంబై దాడుల ప్రధాన సూత్రదారి తహవూర్ రానా(64)కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ముంబై దాడుల కేసులో భారత్‌కు అప్పగించొద్దని రానా చేసిన విజ్ఞప్తిని అమెరికా సుప్రీం కోర్టు కొట్టేసింది.
ప్రస్తుతం రానా లాస్ ఏంజెల్స్‌లోని మెట్రో పాలిటన్ డిటెన్షన్ సెంటర్‌లో ఉన్నారు. రానా విజ్ఞప్తిని అమెరికా సుప్రీం కోర్టు గతంలోనే తిరస్కరించినా కానీ ఆయన మరోమారు ‘ఎమర్జెన్సీ అప్లికేషన్’ దాఖలు చేశారు. తాజాగా ఆ దరఖాస్తును కూడా కోర్టు కొట్టివేసింది.