calender_icon.png 19 January, 2025 | 2:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుప్రీంలో గ్రూప్-1 అభ్యర్థులకు ఎదురుదెబ్బ

22-10-2024 02:01:45 AM

  1. పరీక్షల దశలో జోక్యం చేసుకోలేమన్న ధర్మాసనం
  2. ఫలితాలకు ముందే తుది విచారణ ముగించాలని హైకోర్టుకు ఆదేశం

న్యూఢిల్లీ, అక్టోబర్ 21 : గ్రూప్ 1 పరీక్షను నిలిపివేయాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన అభ్యర్థులకు చుక్కెదురైంది.  పరీక్షలను వాయిదా వేయడం లేదా రీ షెడ్యూల్ చేయాలని దాఖలైన పిటీషన్లపై ఉత్తర్వుల జారీకి సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పిటిషన్‌పై జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది.

గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశా లపై మధ్యంతర ఉత్తర్వుల జారీకి సైతం నిరాకరించింది. ఇదేసమయంలో గ్రూప్ 1 ఫలితాలు వెలువడకముందే పిటిషన్ల పై విచారణను పూర్తిచేసి తీర్పును వెలువరించాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించిం ది. గ్రూప్ పరీక్షలు వాయిదా లేదా రీ షెడ్యూల్ చేయాలని పోగుల రాంబాబు గత శుక్రవారం సుప్రీంకోర్టు ను ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌పై సోమవారం సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతత్వంలోని జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది. ‘ఇప్పటికే అ భ్యర్థులు ఎ గ్జా మ్ సెంటర్‌లో ఉన్నప్పుడు స్టే ఎలా ఇస్తాం?ఇది గందరగోళానికి గురిచేస్తుంది’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

పిటిషనర్ తరపున సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబల్ వాదిస్తూ సుప్రీంకోర్టు గత తీర్పునకు విరుద్ధంగా రాష్ట్ర ప్ర భుత్వం జీవో 29 తీసుకువచ్చిందన్నారు. 14 ఏండ్ల తర్వాత తొలిసారి గ్రూప్ 1 పరీక్ష జరుగుతోందని, మరోసారి వీటిని భర్తీ చేయడం జరగదని, ఈసారి అవకాశం కోల్పోతే, జీవితంలో తుది ఛాన్స్ ఉండదన్నారు.

జీవో 29పై స్పష్టత వచ్చే వరకు పరీక్షలు నిర్వహించవద్దని కోరారు. మధ్యలో సీజే ఐ జోక్యం చేసుకొని ఏ విధంగా పరీక్షలు వాయిదా వేయాలని సర్వీస్ కమిషన్‌ను ఆదేశించగలమని ప్రశ్నించారు. ఇది అసాధారణ మైన విషయమని గుర్తుచేశారు. దీంతో ఎస్సీ, ఎస్టీ వర్సెస్ బిపేంద్రయాదవ్ కేసులోని తీర్పు వివరాలను బెంచ్ ముందు సిబల్ ఉంచారు.

అయినా ఎలా సర్వీస్ కమిషన్‌ను ఆపగలమని కోర్టు వ్యాఖ్యనించింది. అందువల్లే నష్టపోతున్న అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతున్నామని సిబల్ వాదించారు. మరో సారి బెంచ్ స్పందిస్తూ తుది తీర్పునకు లోబడే నియామకాలు జరపాల్సి ఉం టుందని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో వెల్లడించిన విషయాన్ని గుర్తు చేసింది. 

 విచారణ సత్వరమే ముగించండి

గత నెల 31న ఈ కేసు రాష్ట్ర హైకోర్టులో విచారణకు వచ్చిందని ప్రభుత్వం తరపు సీనియర్ అడ్వొకేట్ నిరంజన్‌రెడ్డి ధర్మాసనం దష్టికి తీసుకెళ్లారు. టీజీపీఎస్సీ ఇప్పటికే ఈ కేసులో హైకోర్టు ముందు కౌంటర్ ఫైల్ చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం తమ వాదలను కౌంటర్ రూ పంలో అందజేయనుందని వివరించా రు.

గత విచారణ సందర్భంగా ఈ ఎగ్జా మ్స్ పూర్తి చేసేందుకు ఎంత సమయం పడుతోందని హైకోర్టు ప్రశ్నించిందని, ఫలితాలు ప్రకటించేందుకు ౩ నెలలల సమయం కావాలని సర్వీస్ కమిషన్ సమాధానం ఇచ్చిందని చెప్పారు. మధ్యలో సిబల్ జోక్యం చేసుకొని.. ఫలితాలకు ౩ నెలల టైం ఉన్నందున ఈ కేసును ఈ రోజు విచారించాలని కోరా రు.

ఇందుకు సీజేఐ ధర్మాసనం నిరాకరించింది. ఈ కేసులో ఇచ్చే ఈ మధ్యంత ర తీర్పు అయినా ఎగ్జామ్ ప్రక్రియలో గణనీయమైన ప్రభావం చూపుతుందని కోర్టు అభిప్రాయపడింది. అందువల్ల మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరిస్తున్నట్టు సీజేఐ స్పష్టంచేశారు.   

అయితే నవంబర్ 20న తదుపరి విచారణకు రానుందన్నారు. అందువల్ల  ఫలితాల విడుదలకు ముందే ఈ కేసులో తుది విచారణ ముంగించాలని హైకోర్టుకు సూచించారు. అలాగే పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్టు స్పష్టం చేశారు.