05-04-2025 02:04:17 AM
కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఎంపీ ఆర్ కృష్ణయ్య
హైదరాబాద్, ఏప్రిల్ 4 (విజయక్రాంతి): దేశంలో 56 శాతం జనాభా ఉన్న బీసీల కో సం ప్రత్యేకంగా ఓబీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని రా జ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కోరారు. శుక్రవారం హోంమంత్రి అమిత్‌షాతో ఢిల్లీ లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
పార్లమెంట్‌లో బీసీ బిల్లును ప్రవేశపెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలని కోరారు. రా జ్యాంగం ప్రకా రం బీసీలకు విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో అవకాశాలు దక్కేందుకు సహకరించాలని అన్నారు.
జాతీయ బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీ కుల వృత్తులకు సబ్సిడీ రుణాలు అందించాలని, ఇందుకు కేంద్రం చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బీసీల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరిస్తామని కేంద్రమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారని కృష్ణయ్య తెలిపారు.