calender_icon.png 23 March, 2025 | 1:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథనిలో చలివేంద్రం ఏర్పాటు చేయండి

22-03-2025 04:42:11 PM

కమిషనర్ కు వినతి పత్రంలో విద్యార్థి నాయకుడు డిగంబరం..

మంథని (విజయక్రాంతి): మంథని పట్టణంలో చలివేంద్రం ఏర్పాటు చేయండని మంథని మున్సిపల్ కమిషనర్ మనోహర్ కు శనివారం విద్యార్థి నాయకుడు డిగంబరం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా డిగంబర్ మాట్లాడుతూ... ఈ వేసవికాలంలో మంథని గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలు పట్టడానికి వివిధ పనుల నిమిత్తం వస్తున్నారని, మధ్యాహ్నం వేళలో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని, నీటి సమస్య తీర్చేందుకు మంథని మున్సిపాలిటీ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. ప్రజల సౌకర్యార్థం వెంటనే చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చాలని కమిషనర్ కు వినతి పత్రాంలో కోరారు. స్పందించిన కమిషనర్ త్వరలోనే చలివేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తామన్నారని డిగంబర్ తెలిపారు.