calender_icon.png 3 April, 2025 | 9:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయండి

03-04-2025 12:36:31 AM

  • కేంద్ర మంత్రి కుమారస్వామికి వినతి పత్రం 

అందజేసిన మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి) : మహబూబ్ నగర్ లో సిమెంట్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఢిల్లీ లో ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, సురేష్ కుమార్ రెడ్డి, దామోదర్ రావు లతో కలిసి వినతిపత్రం అందించారు. మహబూబ్ నగర్ లో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు అన్ని సౌకర్యాలు ఉన్నాయని పేర్కొన్నారు.

సిమెంట్ ఫ్యాక్టరీ కి అవసరమైన ముడి పదార్థాలైన సున్నపురాయి, లాటరైట్ రాయి వంటి ముడి పదార్థాలు, స్కిల్ వర్కర్స్ అందుబాటులో ఉన్నారని చెప్పారు. హైదరాబాద్,రాయచూర్,గుల్బర్గా వంటి ఐటీ కారిడార్ ప్రాంతాలు దగ్గరలో ఉన్నాయని పేర్కొన్నారు.

సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు తో ప్రాంత అభివృద్ధి తో పాటు ఉపాధి లభించి ప్రజల ఆర్ధిక పరిస్థితి మెరుగు పడేందుకు అవకాశం ఉందన్నారు. సీసీఐ(సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ద్వారా కొత్త సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని విన్నవించారు.