calender_icon.png 26 November, 2024 | 2:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

70ల నాటి హైదరాబాద్ నేపథ్యంలో..

25-11-2024 11:22:51 PM

నరేశ్ అగస్త్య, మేఘా ఆకాశ్ ప్రధాన పాత్రల్లో ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో రూపొందుతోంది వికటకవి’. తెలుగు, తమిళ భాషల్లో అలరించనున్న డిటెక్టివ్ వెబ్ సిరీస్ ఇది. ఇందులో 1970ల నాటి హైదరాబాద్‌ను అందంగా చూపించనున్నట్టు మేకర్స్ చెప్తున్నారు. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ సిరీస్ జీ5లో నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో సోమవారం సిరీస్ టీమ్ మీడియా ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో నరేశ్ అగస్త్య మాట్లాడుతూ.. జీ5లో నేను పసుపు కుంకుమ’ సీరియల్ చేశాను. ఇప్పుడు లీడ్‌గా వెబ్ సిరీస్‌లు చేస్తున్నాను.

దేశ్‌రాజ్ పట్టుబట్టి నాకు ఈ పాత్ర ఇచ్చారు’ అన్నారు. మేఘా ఆకాశ్ మాట్లాడుతూ.. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన ప్రదీప్‌కు థాంక్స్. ప్రదీప్ డైరెక్షన్ టీమ్ ఎంతో సహకరించింది. నరేశ్‌తో పని చేయడం ఆనందంగా ఉంది. ఆయన చాలా మంచి వ్యక్తి’ అని చెప్పారు. దర్శకుడు ప్రదీప్ మద్దాలి మాట్లాడుతూ.. ఇది చాలా పెద్ద స్పాన్ ఉన్న కంటెంట్. అద్భుతమైన టీమ్ సెట్ అయింది’ అని తెలిపారు. నిర్మాత రామ్ తాళ్లూరి మాట్లాడుతూ.. ఈ కథను సాయితేజ్ రెండేళ్ల ముందే చెప్పాడు. అప్పుడు ఫీచర్ ఫిల్మ్ అనుకున్నాం. కానీ జీ5 వల్ల ఇది వెబ్ సిరీస్‌లా మారింది. కంటెంట్ చూసి చాలా గర్వంగా అనిపిస్తోంది’ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో దర్శక, రచయిత బీవీఎస్ రవి, జీ5 కంటెంట్ హెడ్ సాయితేజ్, జీ5 బిజినెస్ హెడ్ అనురాధ గూడూరు, మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ, కెమెరా మెన్ షోయబ్ తదితరులు పాల్గొన్నారు.