మహబూబ్ నగర్ (విజయక్రాంతి): ఉన్నత శిఖరాలను నిర్దేశించుకుని ముందుకు సాగాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. స్వాతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రివర్యులు భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వం బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థులను లకు నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎంతో శ్రమిస్తూ ఉన్న తల్లిదండ్రుల కలలు నిజం చేసేలా విద్యార్థుల ఆలోచనలు నూతన ఆవిష్కరణలకు సిద్ధం కావాలని సూచించారు.
భవిష్యత్తు బాగుండాలంటే చదువుతో పాటు ఏదైనా ఒక స్కిల్స్ లో నైపుణ్యం సాధించాలని ఆయన సూచించారు. మహబూబ్ నగర్ జిల్లాను ఎడ్యుకేషనల్ హబ్ గా అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, పాలమూరు యూనివర్సిటీలో నూతనంగా ఇంజనీరింగ్, లా కళాశాల అనుమతి తీసుకొని రావడం జరిగిందన్నారు. విద్యార్థులకు ఇది సువర్ణ అవకాశం అని, ఇంజనీరింగ్ చదవాలనే వారు పాలమూరు యూనివర్సిటీలో నూతనంగా ప్రారంభించనున్న ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలో అధిక సంఖ్యలో సీట్లు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, టిపిసిసి అధికార ప్రతినిధి జహీర్ అక్తర్, బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కౌసర్ జహాన్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, సత్తూర్ చంద్రకుమార్ గౌడ్, కృష్ణయ్య యాదవ్, ఎస్సి సెల్ చైర్మన్ సాయి బాబా, అజ్మత్ అలి, నిర్వాహకులు ఫయాజ్, ఫకృద్దిన్ ఖురేషీ, మహ్మద్ ఫైసల్, జహీర్ అహ్మద్, మహ్మద్ అక్బర్ తదితరులు పాల్గొన్నారు.