calender_icon.png 25 February, 2025 | 11:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంగమేశ్వరునికి శేషవాహన సేవ...

25-02-2025 08:22:41 PM

జహీరాబాద్: కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం ఆలయంలో నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శేషవాహాన సేవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆలయ ఆవరణంలో ప్రత్యేక అలంకరణ చేపట్టి పూజలు నిర్వహించి, శేషవాహన సేవను భక్తులు ఆడంబరంగా చేపట్టారు. పల్లకి సేవ నిర్వహించారు. ఆలయంలో స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. జహీరాబాద్ డీఎస్పీ రామ్మోహన్ రెడ్డితో పాటు పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శివ రుద్రప్ప, నాయకులు హన్మంత్ రావ్ పాటిల్, శేఖర్ పాటిల్, వివిధ ప్రాంతాల భక్తులు పాల్గొన్నారు.