calender_icon.png 8 October, 2024 | 8:16 PM

నువ్వుల అన్నం

08-10-2024 12:00:00 AM

తెలంగాణ ఆడపడుచులు ఎంతో ఇష్టంగా జరుపుకునే పండుగ బతుకమ్మ. అమావాస్య నుంచి నవమి వరకు ఆడపడుచులు బతుకమ్మలు ఆడతారు. ఆశ్వీయుజ శుద్ధ నవమి వరకు అంటే తొమ్మిది రోజులు జరుపుకునే పండుగని దేవీ నవరాత్రులు అంటారు. శరదృతువు ఆరంభంలో ఈ పండుగ రావడంతో శరన్నవరాత్రులు అని కూడా అంటారు. ఈ నవరాత్రులు మొదలైన నాటి నుంచి విజయదశమి వరకు శక్తి స్వరూపిని కొలవడం విశేషం. నవరాత్రుల్లో దుర్గామాత ఎంతో ప్రీతికరమైన నైవేద్యాలను సమర్పిస్తారు. దాంట్లో ఒకటి నువ్వుల అన్నం. దాని తయారీ విధానం ఎలానో తెలుసుకుందాం.. 

కావాల్సిన పదార్థాలు: 

బియ్యం-రెండు కప్పులు, నువ్వులు-రెండు చెంచాలు, ఎండు మిర్చి-నాలుగు, మినప్పప్పు-ఒక చెంచా, పచ్చి శనగ పప్పు-ఒక చెంచా, ఆవాలు చెంచా, పసుపు-అర చెంచా, వేరు శనగపప్పు-రెండు చెంచాలు, వెల్లుల్లి-నాలుగు రెమ్మలు, ఇంగువ-చిటికెడు, కరివేపాకు-రెండు రెమ్మలు, నూనె-రెండు చెంచా లు, ఉప్పు తగినంత. 

తయారీ విధానం: 

ముందుగా స్టవ్‌పై పాన్ పెట్టి దాంట్లో పచ్చి శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, నువ్వులు వేసి దోరగా వేయించాలి. చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసి ఈ మిశ్రమాన్ని పక్కన ఉంచాలి. మరొక వెడల్పాటి పెనంలో నూనె వేడి చేసి ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత వేరు శనగపప్పు, వెల్లుల్లి, కరివేపాకు, పసుపు వేసి కలిపి దించేయాలి. ఇందులో అన్నం, ఉప్పు, నువ్వుల మిశ్రమాన్ని వేసి కలపాలి.