హైదరాబాద్, డిసెంబర్ 19: ఎలక్ట్రానిక్ వాహనాల ఛార్జర్ల తయారీ కంపెనీ సర్వోటెక్ పవర్ సిస్టమ్స్ పేరును సర్వోటెక్ రిన్యూవబుల్ పవర్ సిస్టమ్స్‌గా మార్చారు. ఈ మార్పు ఈ డిసెంబర్ 18 నుంచి అమల్లోకి వచ్చింది. ఇటీవల ఈ కంపెనీ జర్మనీకి చెందిన లెస్సాజ్వితో వ్యూహాత్మక భాగస్వా మ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంతో, మైక్రోమొబిలిటీ కోసం 100% సౌరశక్తితో నడిచే ఈవీ ఛార్జింగ్ సదుపాయాల్ని అభివృద్ధి చేసి, జర్మనీలో వాహనాలకు అందించనున్నట్లు సర్వోటెక్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ రమణ్ భాటియా తెలిపారు.