బీజేపీ నియోజకవర్గ ఇంచార్జి ఏనుగు సుదర్శన్ రెడ్డి
మేడ్చల్, ఫిబ్రవరి 2(విజయ క్రాంతి): గో సేవ చేయడం దేవతలను పూజించడంతో సమానమని భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఏనుగు సుదర్శన్ రెడ్డి అన్నారు. నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రాంపల్లి లో బృందావనం గో సేవ సంస్థ ఆధ్వర్యంలో 108 గోదాన మహాయాగ మహోత్సవంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్వాహకులను ఆయన అభినందించారు. బృందావనం యాప్ ను ఏనుగు సుదర్శన్ రెడ్డి, మున్సిపాలిటీ మాజీ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్, నాగారం మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షుడు నాగరాజు యాదవ్ ప్రారంభించారు.