calender_icon.png 1 February, 2025 | 8:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలకు సేవ చేయడం గొప్ప విషయం

26-01-2025 12:36:02 AM

పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు

పెద్దపల్లి, జనవరి 2౫(విజయ క్రాంతి): ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధిగా ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం గొప్ప విషయమని ఎమ్మెల్యే ఎమ్మెల్యే  విజయరమణ రావు అన్నారు.   శనివారం  మున్సిపల్ కౌన్సిల్ ఆత్మీయ వీడ్కోలు సమావేశాలకు  అనంతరం మున్సిపల్ పాలకవర్గం సభ్యులను, మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ మమతా రెడ్డిని  ఎమ్మెల్యే విజయరమణారావు ఘనంగా సత్కరిం చారు.

అనంతరం ఎమ్మెల్యే ను మున్సిపల్ పాలక వర్గాల సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే   మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేసేందుకు ప్రజాప్రతినిధులకు గొప్ప అవకాశం ఉంటుందని అన్నారు. కోట్ల ఆస్తులు ఉన్న ఎవరూ నమస్తే పెట్టరని, నిరుపేద అయినప్పటికీ ప్రజా ప్రతినిధికి పదిమంది నమస్కారం చేస్తారని అన్నారు. నిరంతరం ప్రజల కోసం శ్రమించిన పెద్దపల్లి మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజల ఆశీర్వాదంతో తిరిగి కౌన్సిల్ కు రావాలని కోరుకున్నారు.

ప్రజలతో మమేకమై సేవ చేసే దృక్పథం ఉన్న వారిని ప్రజలు మళ్ళీ ఆశీర్వదిస్తారని అన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ ప్రపోజల్స్ మేరకు పలుమార్లు మున్సిపల్ కౌన్సిలర్ గా ఎన్నికైన  స్వర్గీయ కొంతం శ్రీనివాస్ రెడ్డి శిలాఫలకాన్ని పురపాలక సంఘంలో ఏర్పాటు చేస్తామని, జిల్లా కలెక్టర్ తో మాట్లాడి పెద్దపల్లి మున్సిపాలిటీకి డిసాస్టర్ మేనేజ్మెంట్ కోసం టాస్క్ ఫోర్స్ వెహికల్స్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.

ఐదు సంవత్సరాల పాటు పెద్దపల్లి,  పట్టణ ప్రజలకు సేవలు అందించిన కౌన్సిల్ సభ్యులకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ మమత రెడ్డి,  మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ ఈర్ల స్వరూప, పాలకవర్గం సభ్యులు, అధికారులు  తదితరులు పాల్గొన్నారు.