25-03-2025 12:39:33 AM
కరీంనగర్ క్రైం, మార్చి 24 (విజయ క్రాంతి): వినియోగదారునికి అత్యుత్తమ సేవలు అందించడానికి సాంకేతికతను అందిపుచ్చుకుని అందుకు అనుగుణంగా మరింత మెరుగైన , నాణ్య మైన విద్యుత్ సరఫరా చేయగలుగుతున్నామని కరీంనగర్ సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ ఎం రమేష్ బాబు తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్క పనిలో అధునాతన సాంకేతిక పద్ధతులు అవలంభిస్తున్నామని అన్నారు . విద్యుత్ సరఫరా లో మరింత నాణ్యతను మెరుగుపరచడానికి, వినియోగదారుల సంతృప్తిని పెంచడంలో భాగంగా వినియోగదారులకు ఎదురయ్యే సగటు అంతరాయ వ్యవధి, సగటు అంతరాయల సంఖ్య ని విద్యుత్ అంతరాయాలకు కొలమానంగా తీర్చిద్దిదడం జరిగిందని తెలిపారు. సగటు వినియోగదారునికి కలిగే అంతరాయం, సగటున వినియోగదారునికి ఎన్ని సార్లు జరిగిన అంతరాయం పై రియల్ టైం డాటాను క్రోడీకరించి వాస్తవ గణాంకాల ఆధారంగా విశదీకరించి అంతరాయాలు జరగకుండా సత్వర చర్యలు తీసుకొని విద్యుత్ అంతరాయాలు కనిష్ట స్థాయికి తీసుకొచ్చామని పేర్కొన్నారు.