calender_icon.png 15 January, 2025 | 10:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్వీసుల రంగం జోరు

05-09-2024 12:00:00 AM

5 నెలల గరిష్ఠానికి పీఎంఐ ఇండెక్స్

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: కొత్త వర్క్ ఆర్డర్లతో భారత్ సర్వీసుల రంగం కార్యకలాపాలు జోరందుకున్నాయి. ఆర్థిక వ్యవస్థ వృద్ధి పట్ల కంపెనీలు ఆశాభావంతో ఉన్నట్టు ఆగస్టులో భారీ పెరిగిన వర్క్ ఆర్డర్లు సూచిస్తున్నాయని బుధవారం విడుదలైన నెలవారీ సర్వే ఒకటి వెల్లడించింది. ఆగస్టు నెలలో హెచ్‌ఎస్‌బీసీ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీని సూచించే పర్చేజ్ మేనేజర్స్  ఇండెక్స్ (పీఎంఐ) 60.9 వద్దకు చేరింది.

జూలై నెలలో ఇది 60.3. ఈ ఏడాది మార్చి తర్వాత ఇంతజోరుగా సర్వీసుల రంగం కార్యకలాపాలు పెరగడం ఆగస్టునేలలోనే హెచ్‌ఎస్‌బీసీ చీఫ్ ఎకానమిస్ట్ ప్రజుల్ భండారీ తెలిపారు. పీఎంఐ ఇండెక్స్ 50 ఎగువన ఉంటే వృద్ధి బాటలో ఉన్నట్టు, 50 లోపు ఉంటే క్షీణిస్తున్నట్టు పరిగణిస్తారు. సర్వీసులకు సంబంధించి వాటిని అందించే కంపెనీలు, వాటిని తీసుకునే కంపెనీల మేనేజర్ల ఇచ్చిపుచ్చుకునే ఆర్డర్లపై సర్వే నిర్వహించి పీఎంఐ ఇండెక్స్‌ను  రూపొందిస్తారు.