21-04-2025 07:02:45 PM
మాజీ రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ బూసిరెడ్డి శంకర్ రెడ్డి
భద్రాచలం,(విజయక్రాంతి): రోటరీ క్లబ్ ఆఫ్ రివర్ సైడ్ భద్రాచలం అధ్యక్షులు డా.మదిపెద్ది రమేష్ బాబు ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ ఆఫ్ ఒంగోలు వారి సహకారంతో వికలాంగులకు సోమవారం వీల్ చైర్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రోటరీ తాజా మాజీ గవర్నర్ డాక్టర్ భూశిరెడ్డి శంకర్ రెడ్డి మాట్లాడుతూ... భద్రాద్రిలో రోటరీ క్లబ్ రివర్ సైడ్ సేవలు అభినందనీయమని, పేద వారికి సేవ చేయటం ఎంతో ఆనందం కలిగిస్తుందని, వికలాంగులైన ఆళ్ల సారిక, బొక్క భానుతేజ, మాధవి లకు వీల్ చైర్ లు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో విశిష్ట అతిగా పర్యావరణ వేత్త డాక్టర్ గోళ్ళ భూపతిరావు పాల్గొని మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆఫ్ రివర్ సైడ్ సేవలు అద్భుతంగా ఉన్నాయని, గతంలో కూడా పేద మహిళలకు కుట్టుమిషన్లు, వీల్ చైర్స్ పంపిణీ చేశారని, ఈ కార్యక్రమంలో తనని కూడా ఆహ్వానించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు రమేష్, కార్యదర్శి గంజి సంపత్ , కోశాధికారి ధనకొండ రాఘవయ్య, క్లబ్ సభ్యులు బాచినేని రామకృష్ణ, యశోద ఫౌండేషన్ సభ్యులు కొమ్మ గిరి వెంకటేశ్వర్లు, మేకల లత, రాయల రాము, అప్పనదాస్ బాబు, రాజు పెరియార్ తదితరులు పాల్గొన్నారు.