calender_icon.png 15 April, 2025 | 3:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేద విద్యార్థులకు రైజు ఇండియా ఫౌండేషన్ సేవలు మరువలేనివి

13-04-2025 03:18:44 PM

మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ 

తుంగతుర్తి, విజయక్రాంతి: తుంగతుర్తి మండలంలోని గొట్టిపర్తి గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థిని బుద్ధ కనక శ్రీ హైదరాబాద్ లోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ రెండవ సంవత్సరం కంప్యూటర్ సైన్స్  చదువుతున్నది, నిరుపేద కుటుంబానికి చెందిన ఆమెకు జేఎన్టీయూ క్యాంపస్ లో హాస్టల్ ఫీజు కట్టలేక ఇబ్బంది పడటం పాటు, తను కంప్యూటర్ సైన్స్ చదువుతున్న ఆమెకు లాప్టాప్ లేక ఇబ్బంది పడుతున్న ఆమెకు రైజ్ ఇండియా ఫౌండేషన్ ఆర్గనైజర్ లు చందన, తిరుమల వేణు  నిరుపేద విద్యార్థిని కనక శ్రీ కి తక్షణసాయంగా రూ.1,00,000/- (లక్ష రూపాయల) విలువైన లాప్టాప్ తో, రూ. 30,000/- (ముప్పై వేల  రూపాయలు) ఆర్ధిక సహాయాన్ని ఆదివారం తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు .ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ చందన తాటికొండ సీతయ్య గుండ గాని రాములు గౌడ్ గోపగాని రమేష్ శ్రీను గౌడుచర్ల సత్యనారాయణ గాజుల యాదగిరి తదితరులు పాల్గొన్నారు