లక్షెట్టిపేట,(విజయక్రాంతి): జాతిపిత మహాత్మా గాంధీ(Mahatma Gandhi) సేవలు మరవలేని అని ఆవోప నాయకులు అన్నారు. గురువారం స్థానిక గాంధీ చౌక్ లో మహాత్మా గాంధీ 77వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గాంధీజీ చేసిన సేవలు దేశం మరువలేనివన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో ముందుండి నడిపించిన తీరు నేటికీ ప్రపంచానికి ఆదర్శంగా ఉందన్నారు. శాంతియుత మార్గంలో పోరాడి స్వాతంత్య్రం తీసుకురావడం ప్రపంచంలో ఎక్కడా జరగలేదన్నారు. దేశాన్ని ఒకే తాటిపైకి తీసుకువచ్చి ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా స్వాతంత్రం రావడం గాంధీజీ వల్లనే సాధ్యమైందన్నారు. భవిష్యత్ తరాలకు గాంధీజీ చరిత్రను బోధించడం ప్రతి పౌరుని బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో అవోప నాయకులు వొజ్జల రాజమౌళి పాలకుర్తి సుదర్శన్ కొత్త కిరణ్ కుమార్ అక్కినపల్లి రవీందర్ రాచర్ల సత్యనారాయణ బో ద్దుకూరి సత్తయ్య కాసం రాజయ్య నరేందుల నారాయణ తదితరులు పాల్గొన్నారు.