రాజస్థాన్‌పై విజయంతో సంతోష్ ట్రోఫీ
హైదరాబాద్: దేశవాలీ సంతోష్ ఫుట్‌బాల్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్ సర్వీసెస్ జట్టు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. హైదరాబాద్‌లోని డెక్కన్ ఎరీనా వేదికగా శనివారం గ్రూప్ జరిగిన తొలి మ్యాచ్‌లో సర్వీసెస్ 2 రాజస్థాన్‌పై విజయాన్ని నమోదు చేసుకుంది. సర్వీసెస్ తరఫున శ్రేయస్ వీజీ (ఆట 20వ నిమిషంలో), విజయ్ (85వ ని.లో) గోల్స్ సాధించారు. తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైన సర్వీసెస్ ఆ తర్వాత వరుసగా హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. మరో మ్యాచ్‌లో ఆతిథ్య తెలంగాణ జట్టు 0 జమ్మూ కశ్మీర్ చేతిలో ఓటమి పాలైంది. జమ్మూ తరఫున హయత్ బషీర్ (5వ ని.లో), అరుణ్ నగియల్ (74వ ని.లో), ఆకిఫ్ జావెద్ (88వ ని.లో) గోల్స్ చేశారు. జమ్మూ చేతిలో ఓటమితో ఆడిన 4 మ్యాచ్‌ల్లో ఒక డ్రాతో ఒక పాయింట్ కలిగిన తెలంగాణ టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది.