24-03-2025 12:10:56 PM
వైరా,(విజయక్రాంతి): వైరాలో నాలుగు పరీక్ష కేంద్రాల వద్ద పదో తరగతి విద్యార్థులు ఫైనల్ పరీక్ష రాస్తున్నారు. విద్యార్థులు అనుకోని పరిస్థితుల్లో అస్వస్థతకు గురైన వెంటనే సేవలందించేందుకు 108 సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. మండుతున్న ఎండలు నేపథ్యంలో వడదెబ్బకు గురయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ముందుగానే ఈ సేవలను అధికారులు అందుబాటులో ఉంచారు. కొంతమంది విద్యార్థులు అస్వస్థత ఉన్నప్పటికీ ఫైనల్ పరీక్షలకు హాజరవుతున్నారు. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది తలెత్తినా ఈ సేవలను ఉపయోగించుకోవచ్చని వైరా విద్యాశాఖ అధికారి కొత్తపల్లి వెంకటేశ్వర్లు తెలిపారు.