22-03-2025 12:55:07 AM
విద్యుత్ సబ్‌స్టేషన్‌లో మంటలు
ఎయిర్‌పోర్టుకు నిలిచిపోయిన కరెంటు సరఫరా
సర్వీసులను 24 గంటలపాటు రద్దు చేస్తున్నట్టు ప్రకటన
న్యూఢిల్లీ: స్థానికంగా ఉన్న విద్యుత్ సబ్‌స్టేషన్‌లో మంటలు చెలరేగిన కారణంగా లండన్‌లోని హీత్రో విమానాశ్రయంలో విమాన సర్వీసులు శుక్రవారం రద్దయ్యాయి. సబ్‌స్టేషన్‌లో మంటల కారణంగా ఎయిర్‌పోర్టుకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అన్ని రకాల విమాన సర్వీసులను 24 గంటలపాటు రద్దు చేస్తున్నట్టు హీత్రో ఎయిర్‌పోర్ట్ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. అక్కడి స్థానిక కాలమానం ప్రకారం మార్చి 21 అర్ధరాత్రి వరకూ ఎయిర్‌పోర్ట్ మూసి ఉంటుందని, ప్రయాణికులు ఎవరూ విమానాశ్రయానికి రావొద్దని సూచించింది. ఈ క్రమంలో దాదాపు 120 విమానాలను అధికారులు దారి మళ్లించారు. కాగా ఎయిర్‌పోర్ట్ సమీపంలోని సబ్‌స్టేషన్‌లో భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం 5 గంటలకు మంటలు చెలరేగగా.. విమానాశ్రయాన్ని మూసేస్తున్నట్టు శుక్రవారం ఉదయం 7.30 గంటలకు ఎయిర్‌పోర్టు ప్రకటించింది.