- విధులకు గైర్హాజరైన 99 మంది జీపీ కార్యదర్శులు
- నల్లగొండ కలెక్టర్ చర్యలు
నల్లగొండ, జనవరి 17 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లాలో 99 మంది పంచాయతీ కార్యదర్శుల సర్వీస్ బ్రేక్ చేస్తూ కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. ముందస్తు అనుమతి లేకుండా నెలల తరబడి పంచా యతీ కార్యదర్శులు విధులకు గైర్హాజరవుతుండటంతో వారి సర్వీస్ బ్రేక్ చేస్తూ ఆదేశాలిచ్చారు.
నెలల తరబడి విధులకు ఎందుకు రాలేదో వివరణ ఇవ్వాలని ఇప్పటికే కలెక్టర్ వారికి షోకాజ్ నోటీసు లు జారీ చేశారు. వారం రోజుల్లో ఈ నోటీసులకు వివరణ ఇవ్వాల్సి ఉం టుంది. వివరణ ఆధారంగా తదనంతర శాఖపరమైన చర్యలుంటాయని ఉన్నతాధికా రులు తెలిపారు.
కలెక్టర్ నిర్ణయంతో గైర్హాజరు సమయంలో పంచాయతీ కార్యదర్శులు తమ సర్వీస్ కోల్పోయినట్లయ్యింది. దీంతో ఉద్యోగ క్రమబ ద్ధీకరణ, ఇంక్రిమెంట్లు, పెన్షన్ల విషయంలో తమకు నష్టం జరిగే అవకాశ ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే విధుల్లో చేరేందుకు వచ్చిన వీరందరికీ పనిచేసే చోట కాకుండా వేరేచోట పోస్టింగ్ ఇచ్చారు.
మానవథా దృక్పథంతోనే: కలెక్టర్
నిబంధనల ప్రకారం నెలల తరబడి విధులకు గైర్హాజరైన ఉద్యోగులను క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెండ్ చేసే అవకాశం ఉన్నా మానవతా దృక్పథంతో వారిని విధుల్లోకి తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. సర్వీస్ కోల్పోయిన వారిలో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, రెగ్యులర్ కార్యదర్శులున్నట్లు ఆమె వెల్లడించారు. సర్వీస్ బ్రేక్‌తో పంచాయతీ కార్యదర్శులకు మేలు జరిగిందే తప్ప నష్టం జరగలేదని పేర్కొన్నారు.