calender_icon.png 24 December, 2024 | 8:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైల్వే అధికారులకు సేవా పురస్కారాలు

24-12-2024 01:36:10 AM

హైదరాబాద్, డిసెంబర్ 23 (విజయక్రాంతి): 69వ రైల్వే వారోత్సవాల సందర్భంగా కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ ఉత్తమ రైల్వే అధికారులు, సిబ్బందికి ‘విశిష్ఠ రైల్ సేవా’ పురస్కారాలు ప్రకటించింది. సోమవారం ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చేతుల మీదుగా పురస్కారాలు అందజేసింది. దీనిలో భాగంగా దక్షిణ మధ్య రైల్వేకు చెందిన అధికారులు జవ్వాది వెంకట అనూష, వావిల్లపల్లి శ్రీరాంబాబు, సుమిత్‌శర్మ, అంథోనీ దొరైరాజ్, పీ ఆదినారాయణ, కామారపు వినోద్ పురస్కారాలు అందుకున్నారు.