* శంషాబాద్‌లోని ఓ సెంటర్‌లో మధ్యలోనే నిలిచిన పరీక్ష
* మళ్లీ సాయంత్రం 6.30 గంటలకు నిర్వహణ
* రాత్రి పరీక్ష ముగిసేవరకూ సెంటర్‌లోనే అభ్యర్థులు
హైదరాబాద్, జనవరి 11 (విజయక్రాం తి): టెట్ నిర్వహణలో శనివారం సాంకేతిక సమస్యలు తలెత్తాయి. సర్వర్‌డౌన్ కావడం తో పరీక్ష మధ్యలో నిలిచిపోయింది. 10 నిమిషాల్లో సమస్య పరిష్కారమవుతుందని చెప్పుకుంటూ పరీక్షాకేంద్రం నిర్వాహకులు కాలం వెళ్లబుచ్చారు. ఫలితంగా రాత్రి వరకు సెంటర్‌లోనే అభ్యర్థులు నిరీక్షించారు. పరీక్షకు వెళ్లినవారు బయటకు రాకపోవడం, ఇంటికి చేరుకోకపోవడంతో అభ్యర్థుల కుటుంబసభ్యులు ఆందోళన చెందారు.
పరీక్ష సమయం ముగిశాక కంగారుతో ఫోన్లు చేసినా.. ఫోన్లు బయటే ఉండటం.. వారు స్పందించకపోవడంతో తమ వాళ్లకు ఏం జరిగిందోనన్న టెన్షన్ కనిపించింది. పరీ క్ష మధ్యలోనే ఆగిపోవడంతో అభ్యర్థులను సెంటర్ లోపలే ఉంచారు. దీంతో అభ్యర్థులు ఆకలికి అలమటించినట్లుగా తెలిసింది. విద్యాశాఖ వైఫల్యం కారణంగా సాయంత్రం 4:30 గంటలకు ముగియాల్సిన పరీక్ష.. రాత్రి దాకా నిర్వహించినట్లు సమాచారం.
అభ్యర్థుల ధర్నా..
టెట్ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. శనివారం పేపర్ -2 గణి తం, సైన్స్ (తెలుగు మీడియం) అభ్యర్థులకు పరీక్ష నిర్వహించారు. 155 మంది అభ్యర్థులకు శంషాబాద్ నర్కుడ గ్రామ సమీపం లోని వర్ధమాన్ ఇంజినీరింగ్ కాలేజీలో పరీక్ష కేంద్రాన్ని కేటాయించారు.
మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు పరీక్ష జరగాల్సి ఉంది. పరీక్ష ప్రారంభమైన తర్వాత మధ్యాహ్నం 3గంటల సమ యంలో అర్థంతరంగా పరీక్ష నిలిచిపోయిం ది.
సెంటర్‌లో మొత్తం మూడు సర్వర్‌లుండగా, ఒక సర్వర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో పరీక్ష నిలిచింది. సాంకేతిక సమస్య అని చెప్పిన నిర్వాహకులు పది నిమిషాల్లో సమస్య పరిష్కరిస్తామన్నారు. కానీ ఎంతకూ సమస్య పరిష్కారం కాకపోవడంతో అభ్యర్థుల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తూ సెంటర్ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగా రు.
నిర్వాహకుల తీరును నిరసిస్తూ అభ్యర్థులు సెంటర్‌లో ధర్నా నిర్వహించారు. ఎట్టకేలకు రాత్రి 6:30 గంటల సమయంలో పరీక్ష తిరిగి ప్రారంభమైంది. సత్తుపల్లి నుంచి వచ్చిన ఓ మహిళా అభ్యర్థి పిల్లలతో సహా పరీక్షకు హాజరుకాగా, ఆకలితో అలమటించినట్లుగా తెలిసింది.
సమస్యను పరిష్కరించి పునఃప్రారంభించాం: టెట్ చైర్మన్
శంషాబాద్‌లోని వర్ధమాన్ ఇంజినీరింగ్ కాలేజీలో తలెత్తిన సాంకేతిక కారణాలతో మధ్యాహ్నం సెషన్‌లో పరీక్ష మధ్యలోనే ఆగిపోయిందని, అయితే తర్వాత సమస్యను పరిష్కరించి పునఃప్రారంభించినట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, టెట్ చైర్మన్ నర్సింహారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం సెషన్‌లో 75 శాతం మంది, మధ్యాహ్నం సెషన్‌లో 72.97 శాతం మంది హాజరైనట్లు తెలిపారు.