calender_icon.png 3 April, 2025 | 8:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేద ప్రజలకు సేవ చేస్తా

02-04-2025 10:52:33 PM

మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్..

దౌల్తాబాద్ (విజయక్రాంతి): పదవి ఉన్నా లేకున్నా జీవితాంతం నిరుపేద ప్రజలకు ప్రజాసేవ చేస్తానని మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ అన్నారు. బుధవారం రాయపోల్, తిమ్మక్ పల్లి గ్రామంలో బాధిత కుటుంబాలకు నిత్యవసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చిన్న వయసులోని షాదుల్లా, అబ్దుల్లా మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. ప్రజలకు ఆపద ఎక్కడ ఉంటే తాను అక్కడ ఉంటానని పదవులు ఎప్పుడూ ఎవరికీ శాశ్వతం కాదన్నారు.

తనకు పదవి ఉన్నాలేకున్నా దుబ్బాక ప్రజలతో 30 సంవత్సరాల అనుబంధం ఉందన్నారు. తన ప్రాణం ఉన్నంతవరకు దుబ్బాక నియోజకవర్గ ప్రజలను ఎప్పుడు మరిచిపోనని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కోఆప్షన్ సభ్యులు పర్వేజ్,బీఆర్ఎస్వి రాష్ట్ర యువజన విభాగం నాయకులు రాజిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఇప్ప దయాకర్, చింతకింది మంజూరు, పరశురాములు యూసుఫ్, ఇషాక్, రాజు, షాదుల్, స్వామి, ధన్యకర్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.