calender_icon.png 19 March, 2025 | 1:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగులకు,ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటా

19-03-2025 12:05:17 AM

ఎమ్మెల్సీ  పింగిలి శ్రీపాల్ రెడ్డి 

కోదాడ, మార్చి 18: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తానని వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గ   ఉపాద్యాయ ఎమ్మెల్సీ  పింగిలి శ్రీపాల్ రెడ్డి అన్నారు. కోదాడలోని పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో గత మూడు రోజులుగా హోరా హోరీగా నడుస్తున్న విశ్రాంత ఉద్యోగుల రాష్ట్రస్థాయి క్రీడా సాహిత్య సాంస్కృతిక పోటీల విజేతలకు మంగళవారం బహుమతుల ప్రధానోత్సవం కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.

రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల నుండి వయస్సుతో సంబంధం లేకుండా క్రీడలకు హాజరైన  విశ్రాంత ఉద్యోగులు అభినందనీయులన్నారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి సిహెచ్. లక్ష్మీనారాయణ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు. విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య, వేనేపల్లి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.