బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్
హైదరాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక సర్పం చులుగా పనిచేసిన వారి పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యిందని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. సర్పంచులు అప్పులపాలై కష్టాలు పడుస్తున్నారన్నారు.బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
ఎన్నికల ముందు గ్రామాల్లో సర్పంచుల పరిస్థితి దయనీయం గా ఉందని, తాము అధికారంలోకి వచ్చాక వారికి న్యాయం చేస్తామని ఊదరగొట్టిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు వాళ్లకు చేస్తున్నదేమీటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు సర్పంచులకు తాము అండగా ఉంటామంటూ రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగాన్ని ఈటల మీడియాకు వినిపించా రు.
పెండింగ్ బిల్లులన్నీంటిని క్లియర్ చేసి సర్పంచులకు న్యాయం చేయాలని డిమాం డ్ చేశారు. రాష్ట్రం వాటా ఇవ్వకపోవడం వల్ల ఉపాధిహామీ డబ్బులు విడుదల కావడం లేదన్నారు. రాష్ట్రప్రభుత్వం గ్రామ పంచాయితీలకు రావాల్సిన రిజిస్ట్రేషన్ వాటా, మినర ల్ డెవలప్‌మెంట్ ఫండ్ వాటాను రాకుండా చేస్తోందన్నారు.
మరోవైపు కేంద్రం నుంచి వచ్చే నిధులను పక్కదోవ పట్టిస్తున్నారని ఈటల తెలిపారు. సర్పంచులకు రావాల్సిన నిధులు విడుదల చేయకపోతే మంత్రులను నిలదీయండని రేవంత్ రెడ్డి అన్నారని, ఇం దుకు సర్పంచులు సిద్ధంగా ఉన్నారన్నారు. సర్పంచుల ఆందోళనలకు బీజేపీ సంపూర్ణ మద్దతు లభిస్తోందన్నారు.
గ్రామ పంచాయితీలకు ఎన్నికలు సకాలంలో జరిగితేనే కేం ద్రం నుంచి నిధులు వస్తాయన్నారు. స్థానిక సంస్థలకు ప్రజాప్రతినిధులు లేక ప్రజల సమస్యలను పట్టించుకొనే నాథుడే లేకుండా పోయాడన్నారు. స్థానిక ఎన్నికలకు ముందే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి, ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్ పాల్గొన్నారు.