14-04-2025 06:06:58 PM
జనగామ: హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై సొమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకోంది. స్టేషన్ ఘన్ పురం మండలం రాఘవపురం గ్రామ సమీపంలో కారు లారీ ఢీకొంది. ఈ ప్రమాదలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. కారు హన్మకొండ నుంచి హైదరాబాద్ వెళ్తున్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో డ్రైవర్ తో పాటు మరో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.