calender_icon.png 17 January, 2025 | 1:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షిరిడీ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

17-01-2025 02:23:23 AM

  1. ఎదురుగా ఉన్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేయబోయి ట్రాక్టర్‌ను ఢీకొట్టి తూఫాన్
  2. నలుగురి మృతి, పలువురికి తీవ్రగాయాలు
  3. మృతులు, క్షతగాత్రులందరూ యాదాద్రి భువనిగిరిజిల్లా వాసులుగా గుర్తింపు

యాదాద్రి భువనగిరి జనవరి 16 (విజయ క్రాంతి): మహారాష్ట్రలోని షిరిడీ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందగా అందులో ఓ ఆరునెలల చిన్నారి ఉండటం కంటతడి పెట్టిస్తోంది.  మృతులంతా యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప గ్రామానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు.

వివరాలు.. కొడగడపకు చెందిన శమిషెట్టి కృష్ణమూర్తి తన కుమార్తె, కుమారుడుతో పాటు కుటుంబ సభ్యులు 14 మందితో కలసి  రెండ్రోజుల క్రితం అద్దెకు తీసుకున్న తూఫాన్ వాహనంలో షిరిడీ పర్యటనకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో  వారి వాహనం షిరిడీ సమీపంలో గురువారం రాత్రి మరో వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే క్రమంలో అదుపతప్పి ట్రాక్టర్‌ను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో కొడగడపకు చెందిన శామిషెట్టి ప్రేమలత(55), కుమార్తె తొలుపునూరి ప్రసన్న(42), ఆమె కుమారుడు అక్షిత్ (20)తో పాటు కృష్ణమూర్తి మనవడు 6నెలల శమిషెట్టి వైద్విత్ అక్కడికక్కడే మృతిచెందారు.  మృతదేహాలను స్థానికంగ ఆఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడిన కృష్ణమూర్తి, ఆయన కుమారుడు వెంకన్న, అల్లుడ శ్రీనివాస్, కూతురి కుమార్తె శరణ్య ఔరంగాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రమాదంలో మృతిచెందడంతో కొండగడప గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా శమిషెట్టి కృష్ణమూర్తి వ్యాపార రీత్యా గత 12 ఏళ్లుగా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నట్లు గ్రామస్తులు తెలిపారు.