calender_icon.png 28 April, 2025 | 4:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

27-04-2025 04:48:09 PM

వికారాబాద్: వికారాబాద్ జిల్లా(Vikarabad District) కొడంగల్ మండలం ఐనన్ పల్లి వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి సంబంధించి ఎస్సై సత్యనారాయణ(SI Satyanarayana) తెలిపినా వివరాలు ఇలా ఉన్నాయి. కూకట్ పల్లికి చెందినా ముగ్గురు వ్యక్తులు కర్ణాటకలోని దత్తాత్రేయ స్వామి ఆలయానికి కారులో బయలుదేరి వెళ్లారు. దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా ఐనన్ పల్లి వద్ద జాతీయ రహదారిపై బొలెరో వాహనం ఎదురుగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని ఎస్సై సత్యనారాయణ తెలిపారు. మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.