30-04-2025 04:42:54 PM
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా(Nellore District) కోవూరు మండలం పోతిరెడ్డిపాలెంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పొగా, ఐదుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారని వైద్యులు తెలిపారు. బుచ్చిరెడ్డిపాలెంలో జరిగిన ఓ నిశ్చితార్థ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.