calender_icon.png 26 January, 2025 | 7:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

25-01-2025 10:03:14 AM

ఒకరు మృతి, ఇద్దరికీ గాయాలు 

బైకును ఢీకొన్న కంటేనర్ లారీ

గాయపడిన వారిని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

కామారెడ్డి, (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కంటైనర్ లారీ బైకును ఢీకొనడంతో బైక్ పై వెళ్తున్న ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. కామారెడ్డి వైపు నుంచి బైకుపై భార్య కుమారునితో కలిసి వెళుతున్న వారిని కంటైనర్ లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ 44వ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుఉంది. గుర్తుతెలియని వ్యక్తి బైకుపై తన భార్య కుమారుని వెంటబెట్టుకుని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. గాయపడిన మృతుని భార్య కుమారుడిని కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి 108 అంబులెన్స్ లో తరలించారు. స్థానికులు సదాశివ నగర్ పోలీసులకు సమాచారం అందించారు.