calender_icon.png 6 February, 2025 | 6:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గారేపల్లి సెంటర్లో ఘోర రోడ్డు ప్రమాదం

06-02-2025 04:53:12 PM

మహాదేవపూర్ (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని గారేపల్లి సెంటర్లో జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనదారుడిని ఢీకొట్టిన ఇసుక లారీ. లారీ ద్విచక్ర వాహనా దారుడిని కొన్ని మీటర్ల దూరం ఈడ్చికేల్లడంతో  రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ లారీని వదిలి వెళ్లిపోవడంతో స్థానికులు మరియు పోలీసులు వాహనదారుడుని ఆసుపత్రికి తరలించారు. అనంతరం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి గారేపల్లి సెంటర్ నుండి వెళ్తున్న జాతీయ రహదారికి బైపాస్ రోడ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.