calender_icon.png 28 April, 2025 | 4:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వడ్ల కొనుగోళ్లలో తీవ్ర నిర్లక్ష్యం

26-04-2025 12:00:00 AM

  1. కేంద్రాలు లేక దళారులకు అమ్ముతున్న రైతులు 
  2. ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్

సిద్దిపేట, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): ధా న్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్ల క్ష్యం ప్రదర్శిస్తుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. శుక్రవారం సిద్దిపేట నియోజకవర్గంలోని నంగునూరు మండలం పాలమాకుల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లా డారు. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట వంటి జిల్లాల్లో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు దళారులకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. క్వింటా లుకు రూ.2,320 మద్దతు ధర రావాల్సి ఉండగా దళారులకు రూ.2 వేలకే అమ్ముకుంటున్నారని చెప్పారు.

అకాల వర్షాలు, వడగండ్ల వానల భయంతో రైతులు కల్లాల్లోనే ధాన్యాన్ని దళారులకి అమ్ముకునే దుస్థితి నెలకొందన్నారు. గతేడా ది వానాకాలంలో మొత్తం 1 లక్షా 53 వేల మెట్రి క్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తామని చెప్పి కేవలం 52 వేల మెట్రిక్ టన్నులే ప్రభుత్వం సేకరించిందన్నారు. మిగతా 90 వేల మెట్రిక్ టన్నుల ధా న్యాన్ని వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాసంగి పంటకు కూడా ప్రభుత్వంలో అదే నిర్లక్ష్యం కనబడుతోందన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలు, గాలి దుమారం వల్ల మూడు నాలుగు లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిన్నదని చెప్పారు. అందుకు ఎకరాకు రూ.20 వేల చొ ప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాలమాకుల కేంద్రంలో వడ్లు కొని వారం అయినా రైతులకి డబ్బులు ఇవ్వలేదన్నారు. గన్నీ బ్యాగులు నాణ్యంగా లేకపోవడం వల్ల హమాలీలకు ఇబ్బందిగా ఉందని, తూకంలో క్వింటాలకు రెండు కిలోలు తరుగు ఆరోపించారు.