23-02-2025 10:32:51 PM
ఖమ్మం (విజయక్రాంతి): మండలంలో ఆదివారం వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో అయిదుగురికి తీవ్ర గాయాలైయ్యాయి. ఖమ్మంకు చెందిన వేణుకుమార్, సంధ్య దంపతులు బైక్ పై కోదాడ వైపు వెళుతుండగా ఆచార్లగూడెం వద్దకు రాగానే... బైక్ అదుపు తప్పిపడిపోయింది. ఈ ప్రమాదంలో భార్యా భర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే నేలకొండపల్లికి చెందిన షేక్ మదర్సవలీ (30) అనే యువకుడు కోదాడ వైపు నుంచి నేలకొండపల్లికి బైక్ పై వస్తుండుగా పెట్రోల్ బంక్ సమీపంలో డివైడర్ తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు. అదేవిధంగా మండలంలోని చెరువు మాదారం క్రాస్ రోడ్డు వద్ద బైక్ నుంచి పడి ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని కోదాడ అస్పత్రికి తరలించారు.